Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రొ రెజ్లింగ్ లీగ్ మూడో సీజ‌న్ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో సంద‌డి చేసిన రెజ్ల‌ర్లు

  • డ్యాన్సులు, ర్యాంప్ వాక్‌లు చేసిన క్రీడాకారులు
  • స్టెప్పులు వేసి ఆక‌ట్టుకున్న గీతా ఫొగ‌ట్‌
  • జ‌న‌వ‌రి 9 నుంచి ప్రారంభంకానున్న ప్రొ రెజ్లింగ్‌
త్వ‌ర‌లో ప్రారంభంకానున్న ప్రొ రెజ్లింగ్ లీగ్ మూడో సీజ‌న్‌కి సంబంధించిన ఓ ప్ర‌త్యేక కార్యక్ర‌మం ఢిల్లీలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో రెజ్ల‌ర్లు డ్యాన్స్‌లు, ర్యాంప్ వాక్‌లు చేసి అల‌రించారు. రియో ఒలింపిక్స్‌ పతక విజేత సాక్షి మాలిక్‌, కామన్‌వెల్త్‌ గేమ్స్‌ స్వర్ణ పతక విజేత గీతా ఫొ పొగట్‌తో పాటు ప్రపంచ ఛాంపియన్‌ హెలెన్ వంటి క్రీడాకారులు డ్యాన్సులు చేసి ఆక‌ట్టుకున్నారు.

ముఖ్యంగా 'దంగ‌ల్' సినిమాలోని ఓ పాటకు గీతా ఫొగట్, రీతూ ఫొగ‌ట్‌ చేసిన డ్యాన్స్ అంద‌రినీ ఆకర్షించింది. బాలీవుడ్‌లో క్రీడల నేపథ్యంలో వచ్చిన సినిమాల్లోని పాటలకు ఇత‌ర రెజ్ల‌ర్లు స్టెప్పులు వేశారు. అంతేకాకుండా ప్ర‌త్యేక దుస్తులు ధ‌రించి ర్యాంప్ మీద న‌డిచారు. జనవరి 9నుంచి పీడబ్ల్యూఎల్‌-3వ సీజన్‌ ప్రారంభంకానుంది. రెజ్లింగ్ క్రీడ‌కు మంచి ప్రాచుర్యం క‌ల్పించ‌డానికి ప్రొ రెజ్లింగ్ లీగ్‌ గొప్ప ప్లాట్‌ఫాం అని క్రీడాకారులు అన్నారు.
pro wrestling
sakshi malik
third season
geetha phogat

More Telugu News